 
															గుంటూరులో సూదిగాడి కలకలం
గుంటూరులో గురువారం రాత్రి 8 గంటల సమయంలో సూది గాడి కలకలం రేగింది. ఏటీ అగ్రహారానికి చెందిన ఆటోడ్రైవర్
	సూదిదాడి కాదని తేల్చిన పోలీసులు
	 
	 గుంటూరు రూరల్ : గుంటూరులో గురువారం రాత్రి 8 గంటల సమయంలో సూది గాడి కలకలం రేగింది. ఏటీ అగ్రహారానికి చెందిన ఆటోడ్రైవర్ ఎన్.దుర్గారెడ్డి   15వ లైన్ మెయిన్‌రోడ్డుపై ఆటోను రోడ్డు పక్కగా నిలిపి స్కూల్ పిల్లలకోసం వేచియుండగా,  ఎవరో భుజంమీద సూదితో గుచ్చివెళ్లినట్లుగా అనిపించింది. వెంటనే చిన్నారులను ఎక్కించుకుని వారి ఇళ్లవద్ద దించి జీజీహెచ్‌కి వచ్చాడు.  గంటకు పైగా వైద్యులు  బాధితుడికి పరీక్షించారు. అనంత రం అడిషనల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు,  డెర్మటాలజీ డాక్టర్ వాణి మాట్లాడుతూ అది సూదిదాడి కాదని తేల్చి చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
