టీడీపీ నేత జయరామిరెడ్డి నిర్వాకం  | Gummagatta TDP Leader Jayarami Reddy Play Suicide Drama | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత జయరామిరెడ్డి నిర్వాకం 

Nov 12 2019 4:32 PM | Updated on Nov 12 2019 5:05 PM

Gummagatta TDP Leader Jayarami Reddy Play Suicide Drama - Sakshi

సాక్షి, అనంతపురం: పురుగుల మందు తాగానంటూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ నేత ఆడిన డ్రామా బెడిసికొట్టడంతో చివరికి అబాసు పాలయ్యారు. గుమ్మగట్ట టీడీపీ నేత జయరామిరెడ్డి సోమవారం పురుగుల మందు డబ్బా పట్టుకుని తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చారు. పురుగుల మందు తాగానంటూ రెవెన్యూ అధికారుల వద్ద డ్రామాకు తెరలేపారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు బళ్లారి తరలించారు. జయరామిరెడ్డి పురుగుల మందు తాగలేదని బళ్లారి వైద్యుల రక్తపరీక్షలో వెల్లడయ్యింది.  జయరామిరెడ్డి నాటకం ఆడారనే అనే వాస్తవం వెలుగు చూసింది. ప్రభుత్వ స్థలాన్ని సొంతం చేసుకునేందుకే ఆయన ఆత్మహత్యాయత్నం నాటకం ఆడినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement