రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణవాదులంతా రోడ్లపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ జయహో తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నల్లగొండలోని అమరవీరులస్థూపం వద్ద విజయోత్సవ సందడి నెలకొంది. టీజేఏసీ, కాంగ్రెస్, బీజేపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలతో హడావిడి వాతావరణం కనిపించింది. అరవై ఏళ్ల పోరాటం ఫలించిందని, ఉభయసభల ఆమోదంతో అమరవీరుల ఆత్మ శాంతిస్తుందంటూ తెలంగాణవాదులు ఆనందం వ్యక్తం చేశారు.