వండర్‌ వలంటీర్‌!

Grama volunteer Key Roll in COVID 19 Cases Findout - Sakshi

సంక్షేమ పథకాల  అమలులో వారిది కీ రోల్‌

కరోనా కేసుల గుర్తింపులోనూ కీలకపాత్ర

సకాలంలో సమాచారం అందజేత

యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి  యంత్రాంగం

ఒంగోలు టౌన్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ/వార్డు వలంటీర్లు ఇప్పుడు కరోనా కేసుల గుర్తింపులోనూ కీ రోల్‌ పోస్తున్నారు. వండర్‌ వలంటీర్లుగా ప్రశంసలు అందుకుంటున్నారు. 50 నుంచి 60 కుటుంబాలకు ఒకరి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లను నియమించింది. వారి పరిధిలోని కుటుంబాలకు సంబం«ధించిన సంక్షేమ కార్యక్రమాల్లో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండు నెలల నుంచి సామాజిక భద్రత పింఛన్ల నగదును లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వలంటీర్లు స్వయంగా అందజేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని గుర్తించడంలోనూ వీరు ప్రముఖ పాత్ర పోషిస్తూ అటు అధికారులు, ఇటు ప్రజల మన్ననలు పొందుతున్నారు. వీరు ఏదో ఒక కార్యక్రమానికే పరిమితం కాకుండా ప్రజారోగ్య విషయంలో కూడా భాగస్వాములు కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వలంటీర్‌ ప్రత్యక్షం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. సచివాలయాలకు సంబంధించి ప్రాధాన్యతా అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యదర్శులను నియమించింది. పట్టణ ప్రాంతాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఆ సచివాలయాలకు వలంటీర్లను అనుసంధానం చేసింది. సచివాలయాలు ఏర్పాటు చేసే ముందు వలంటీర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఆ ఇళ్లల్లో ఎంతమంది నివశిస్తున్నారన్న సమగ్ర సమాచారాన్ని ఫోన్‌ నంబర్లతో సహా వలంటీర్లు సేకరించి తమ వద్ద ఉంచుకున్నారు. ప్రతి వలంటీర్‌ తన పరిధిలోని   ఇళ్లలో నివసించే ప్రతి ఒక్కరి సమగ్ర సమాచారం తన వద్ద భద్రపరచుకున్నారు. ఒక వ్యక్తి పేరు చెబితే వెంటనే ఆ వ్యక్తి, కుటుంబ సభ్యుల వివరాలు టకాటకా చెప్పేయడం వీరి ప్రత్యేకత.

కరోనాలో కీలకపాత్ర..
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. జిల్లా కేంద్రం ఒంగోలు రాంనగర్‌లో తొలుత ఒక అనుమానిత కేసు నమోదైంది. అతడికి నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఆ కేసును గుర్తించడంలో వలంటీర్‌ కీలకపాత్ర పోషించాడు. మూడు రోజుల క్రితం జెడ్పీ కాలనీలో కరోనా కేసు నమోదైంది. ఈ కేసును కూడా అక్కడి వార్డు వలంటీరే ముందుగా సమాచారాన్ని సేకరించి యంత్రాంగానికి అందించారు. దీంతో సకాలంలో ఆ కుటుంబ సభ్యులందరిని రిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో ఉంచే అవకాశం కలిగింది. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చేవారి ద్వారా ఆ వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో అలాంటి వారిని గుర్తించడంలో వార్డు వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్నవారు, విదేశాల్లో స్థిరపడినవారు, స్వగ్రామాలకు వస్తున్నవారి వివరాలను సకాలంలో గుర్తించడంలో సక్సెస్‌ అయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top