తొలి నెల జీతం.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు | Grama Volunteer Gives One Month Salary To CM Relief Fund | Sakshi
Sakshi News home page

తొలి నెల జీతం.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు

Oct 6 2019 5:19 AM | Updated on Oct 6 2019 5:19 AM

Grama Volunteer Gives One Month Salary To CM Relief Fund - Sakshi

తోటపల్లిగూడూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోడూరు పంచాయతీకి చెందిన వలంటీర్‌ తలారి దయాకర్‌ తన ఔదార్యాన్ని చూపారు. తొలి నెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల గ్రామ వలంటీర్లకు నెలన్నర జీతాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ నేపథ్యంలో దయాకర్‌ తన తొలి నెల వేతనం రూ.5 వేలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేయాలని కోరుతూ సంబంధిత  చెక్కును ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అందించారు. తన మొదటి నెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని దయాకర్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement