రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం ఉదయం ఢిల్లీ వచ్చి వెళ్లారు. ఉదయం తొమ్మిదిన్నర సమయంలో ఢిల్లీకి వచ్చిన నరసింహన్ కొద్దిసేపు ఏపీభవన్‌లో గడిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం ఉదయం ఢిల్లీ వచ్చి వెళ్లారు. ఉదయం తొమ్మిదిన్నర సమయంలో ఢిల్లీకి వచ్చిన నరసింహన్ కొద్దిసేపు ఏపీభవన్‌లో గడిపారు. అనంతరం ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన సమీప బంధువును పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడే దాదాపు రెండు గంటల సమయం గడిపిన నరసింహన్ సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగపయనమయ్యారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న నేపథ్యంలో అక్కడి పరిణామాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకే నరసింహన్ ఢిల్లీ వచ్చారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేకుండానే ఆయన పర్యటన ముగిసింది.