ఆ రెండింటికీ... చాటుమాటే గతి ! | Government public schools no toilets | Sakshi
Sakshi News home page

ఆ రెండింటికీ... చాటుమాటే గతి !

Dec 11 2013 3:49 AM | Updated on Aug 28 2018 5:25 PM

ఆ రెండింటికీ... చాటుమాటే గతి ! - Sakshi

ఆ రెండింటికీ... చాటుమాటే గతి !

కానీ ఈ ఆదేశాలు జిల్లాలో అమలు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలోని 3,458 పాఠశాలల్లో రెండు లక్షల 55 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు.

విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ :కానీ ఈ ఆదేశాలు జిల్లాలో అమలు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలోని 3,458 పాఠశాలల్లో రెండు లక్షల 55 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖలో నమోదైన వివరాల మేరకు 724 పాఠశాలల్లో ఇంకా మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించలేదు. వీటిలో 668 వరకు ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఉన్నత పాఠశాలు 26, ప్రాథమికోన్నత పాఠశాలలు 30 వరకు ఉన్నాయి.  నిర్మా ణం పూర్తి చేసుకొని ప్రారంభమైనప్పటికీ సుమారు 18 వందల పాఠశాలల్లో నీటి సౌకర్యం లేక వినియోగానికి దూరంగా ఉన్నాయి. సంబంధిత పాఠశాలల్లో ఒంటికైనా... రెంటికైనా.. బయటకు పరుగుతీయాల్సిందే. రోజులో సుమారు ఆరు  గంటలు పాఠశాలల్లోనే గడుపుతారు. అయితే ఆ సమయాల్లో మల, మూత్ర విసర్జనకు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఉచితంగా సమకూర్చుతున్న శానిటరీ నాప్‌కిన్స్ యుక్తవయసు విద్యార్థినులు ఉపయోగించుకోవాలన్నా, పరిశుభ్రమైన మరుగుదొడ్లు పాఠశాలలో అందుబాటులో లే  వు. బాలురలతోపాటు ఆరుబయట చాటు స్థలాల్లోనే మల, మూత్రవిసర్జన చేస్తున్నారు. 
 
 ‘డీఈఓ, ఆర్‌వీఎం పీఓ,   కలెక్టర్ కార్యాలయాలకు సమీపంలోని కంటోన్మెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం లేక పక్కనే ఉన్న పార్కుల్లోని చాటు   మాటు స్థలాలకు వెళ్తున్నారు. అక్కడ పురుగూపుట్రా ఉంటే పరిస్థితి ఏమిటన్నది ఏలికలకే తెలియాలి.  రూ. 2.5 లక్షల వెచ్చించి ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించారు. నీటి సౌకర్యం లేక తాళాలేసి నిరుపయోగంగా వదిలేశారు.’ కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఉన్న ఈ పాఠశాల ఇలా ఉంటే జిల్లా అధికారులు వెళ్లని మారుమూలు గ్రామీణ ప్రాంతాల పాఠశా లు ఏ పరిస్థితిలో ఉంటాయో ఊహించవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరుగొడ్ల సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత రాజీవ్ విద్యామిషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలకు అప్పగిచారు. అయితే వాటి నిర్మాణంలో నాణ్యత లోపం, ప్రారంభమయ్యాక వాటి నిర్వహణ లోపం వంటి పలు సమస్యలపై పర్యవేక్షణ కరవవుడంతో అకరొరగా నిర్మితమైన మరుగుదొడ్లుకూడా వినియోగానికి దూరంగా ఉంటున్నాయి
 
 పెరుగుతున్న  డ్రాపౌట్లు...
 పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవడంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ప్రధానంగా విద్యార్థినులు సక్రమంగా పాఠశాలలకు రాలేక పోతున్నారు. మరి కొంతమంది పాఠశాలకు రావడం మానేస్తున్నారు. పాఠశాల వేళల్లో విద్యార్థినులు ఆరుబయటకు పోవాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉండడంతో  ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదు. నిర్మాణం పూర్తయిన పలు మరుగుదొడ్లకు నీటి వసతిలేదు. దీంతో అవి కూడా నిరుపయోగంగానే ఉంటున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement