రోడ్డున పడేస్తున్నారు | governement doing all things wrong | Sakshi
Sakshi News home page

రోడ్డున పడేస్తున్నారు

May 27 2015 9:30 PM | Updated on May 29 2018 4:06 PM

భజరంగ్ జూట్ మిల్లును మూసేందుకు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

గుంటూరు: భజరంగ్ జూట్ మిల్లును మూసేందుకు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అపార్ట్ మెంట్లు, గ్రూప్ హౌస్ల నిర్మాణం పేరుతో పరిశ్రమ స్థలాలను రియల్ ఎస్టేట్ వారికి అప్పగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మూడు వేలమంది కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా స్థలాలను అమ్మేశారని చెప్పారు. అక్రమాలు ఆపకపోతే కార్మికులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు

Advertisement
 
Advertisement
Advertisement