'ప్రత్యేక హోదా కోసం బిచ్చం ఎత్తుకోం' | gorantla buchaiah choudary takes on central government | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా కోసం బిచ్చం ఎత్తుకోం'

Apr 24 2015 6:43 PM | Updated on Jul 12 2019 5:45 PM

'ప్రత్యేక హోదా కోసం బిచ్చం ఎత్తుకోం' - Sakshi

'ప్రత్యేక హోదా కోసం బిచ్చం ఎత్తుకోం'

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తాము బిచ్చం ఎత్తుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తాము బిచ్చం ఎత్తుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్సభలో ప్రకటించిన నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఇదో దుర్దినమని, ఏపీ హక్కుల కోసం తాము పోరాడుతామని చెప్పారు.

ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఇదే విషయంపై మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని రామకృష్ణ సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement