చంద్రబాబుపై నక్కలపల్లి పీఎస్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు

Golla Baburao Complaint On Chandrababu In Nakkalapalli Police Station - Sakshi

విశాఖపట్నం: దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు నక్కలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతి సందర్భంలో దళితులను అవమానించడం అలవాటైపోందన్నారు.

చదవండి: 'కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టావ్‌'

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ అనేక సందర్భాల్లో దళితులను హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పటికీ ఆయన వైఖరి మార్చుకోవడం లేదన్నారు. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేసు నమోదు చేయకపోతే దళితుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో ఉన్న దళితులు ఇప్పటికైనా చంద్రబాబు నైజం తెలుసుకోవాలన్నారు. 

చదవండి: విజయకుమార్‌గాడు మాకు చెబుతాడా!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top