దొరికిపోయిన దొంగ బంగారయ్యలు | gold theifs caught in shamshabad airport | Sakshi
Sakshi News home page

దొరికిపోయిన దొంగ బంగారయ్యలు

Jan 13 2014 12:43 AM | Updated on Sep 2 2017 2:34 AM

ఐదుగురు బంగారయ్యలు. దొంగబంగారంతో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిపోయారు. అన్నీ అనుకూలిస్తే ఆ బంగారం వారికే దక్కేది! కానీ, కస్టమ్స్ అధికారులు వారి ప్రయత్నాన్ని పారనీయలేదు

 విమానాశ్రయంలో ఐదుగురి నుంచి కిలో బంగారం స్వాధీనం
 హైదరాబాద్, న్యూస్‌లైన్: ఐదుగురు బంగారయ్యలు. దొంగబంగారంతో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిపోయారు. అన్నీ అనుకూలిస్తే ఆ బంగారం వారికే దక్కేది! కానీ, కస్టమ్స్ అధికారులు వారి ప్రయత్నాన్ని పారనీయలేదు. ఆదివారం థాయ్ ఎయిర్‌వేస్‌లో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురి నుంచి కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు, మరో ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని అధికారులు తెలిపారు.
 
  ప్రయాణికులు జీన్స్‌ప్యాంటు లోపల, లో దుస్తుల్లో బిస్కెట్లు, ఆభరణాల రూపంలో బంగారాన్ని దాచి తీసుకొచ్చారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని అంచనా. నిందితుల వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement