విద్యార్థినులకు బంగారు పతకాలు ప్రదానం | Gold medals awarded to students | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు బంగారు పతకాలు ప్రదానం

Sep 23 2013 1:19 AM | Updated on Sep 1 2017 10:57 PM

ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు నరసాపురం రోటరీ క్లబ్ సభ్యులు పురస్కారాలను అందజేశారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన

నరసాపురం, న్యూస్‌లైన్: ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు నరసాపురం రోటరీ క్లబ్ సభ్యులు పురస్కారాలను అందజేశారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి రోటరీ గవర్నర్ డీవీఆర్ పూషా అతిథిగా పాల్గొన్నారు. గత ఏడాది 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలలో టౌన్ ఫస్ట్ సాధించిన ఆదిత్య స్కూల్ విద్యార్థినులు జీఎల్‌ఎస్ ప్రవల్లిక, లోకం ధనుంజయ కుమారి, పరసా సౌజన్యలకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. పాలంకి విశ్వనాథశాస్త్రి, కోట్ల రామ్‌కుమార్, ఆడిటర్ రామ్మోహన్ సౌజన్యంతో విద్యార్థులకు బంగారు పతకాలు సమకూర్చారు.రోటరీక్లబ్ అధ్యక్షుడు తోట శ్రీనివాసబాబు, కార్యదర్శి పాలంకి సుబ్బారావు,  పార్వతీదేవి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement