సమాచారమిచ్చినా రాని 108 | given information no Ambulance a baby died | Sakshi
Sakshi News home page

సమాచారమిచ్చినా రాని 108

May 27 2015 12:38 AM | Updated on Sep 3 2017 2:44 AM

సమాచారమిచ్చినా రాని 108

సమాచారమిచ్చినా రాని 108

ఫోన్‌చేసి రెండు గంటలయినా 108 అంబులెన్స్ రాకపోవడంతో ఆదివాసీ మహిళ మృతశిశువుకు జన్మనిచ్చింది.

- కడుపులోనే శిశువు మృతి
- తల్లి క్షేమం
- ఆస్పత్రిలో సేవలపై ఆరోపణలు
పెదబయలు:
  ఫోన్‌చేసి రెండు గంటలయినా 108  అంబులెన్స్ రాకపోవడంతో ఆదివాసీ మహిళ మృతశిశువుకు జన్మనిచ్చింది. పెదబయలు పీహెచ్‌సీ పరిధి సీకరి గ్రామానికి చెందిన సీకరి తౌడమ్మకు మంగళవారం ఉదయం నుంచి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఉదయం 8.15గంటలకు 108  అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి అంబులెన్స్‌ను పంపుతున్నట్టు కాల్‌సెంటర్ నుంచి సమాధానమొచ్చింది. 9 గంటలకు మళ్లీ ఫోన్ చేశారు. ఎంతకి రాకపోవడంతో 10 గంటలకు ఆటోలో పెదబయలు పీహెచ్‌సీకి తౌడమ్మను తరలించారు. అప్పటికి అందుబాటులో ఉన్న ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ పరిశీలించారు. తౌడమ్మ మృతశిశువుకు జన్మనిచ్చింది. స్టాఫ్‌నర్స్ లేదని, 108 వాహనం సకాలంలో వస్తే మెరుగైన వైద్యం అంది శిశువు బతికి ఉండేదని భర్త మత్యలింగం వాపోయారు. కాన్పు తేదీకి వారం రోజుల ముందుగానే పీహెచ్‌సీకి ఆమెను తరలించకపోవడం ఇక్కడ శోచనీయం.

శిశువు కడుపులోనే చనిపోయింది: కడుపులోనే శిశువు చనిపోయిందని, ఇలా తక్కువ మందిలో మాత్రమే చనిపోయిన శిశువు ప్రసవం అవుతుందని, తల్లిని మాత్రం కాపాడగలిగామని ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement