వివాహిత యువకుడి వేధిం పులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సిరిపురం గ్రామం లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
సిరిపురం (రామన్నపేట), న్యూస్‌లైన్: వివాహిత యువకుడి వేధిం పులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సిరిపురం గ్రామం లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంజి శ్రీజ(20)ను అదేగ్రామానికి చెందిన మన్సూర్ (28) అనే వివాహితుడు పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా వేధిం చసాగాడు. పలుమార్లు అమ్మాయి తల్లిదండ్రులు పెద్దమనుషుల సమక్షంలో మందలించారు. ఇటీవల శ్రీజకు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభిం చారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి పదిన్నర గంటలకు అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి చేస్తే ఊరుకోనని బెదిరిం చాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీజ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో రంగుల అద్దకానికి ఉపయోగించే నైటాప్ అనే రసాయాన్ని సేవించింది. కుటుంబసభ్యులు 108 వాహనంలో కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొం దుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వై.హరిబాబు తెలిపారు. రెండేళ్ల క్రితమే మన్సూర్‌కు వివాహం జరిగింది. అతడు సుమో డ్రైవర్.