రేపు విజయవాడలో ఘంటసాల జయంత్యుత్సవాలు | Ghantasala venkateswara rao 100th anniversary in vijayawada | Sakshi
Sakshi News home page

రేపు విజయవాడలో ఘంటసాల జయంత్యుత్సవాలు

Dec 3 2014 2:46 AM | Updated on Sep 2 2017 5:30 PM

ఈ నెల 4న పద్మశ్రీ పురస్కార గ్రహీత ఘంటసాల వెంకటేశ్వరరావు 92వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శశిబాబు కనపాల తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న పద్మశ్రీ పురస్కార గ్రహీత ఘంటసాల వెంకటేశ్వరరావు 92వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శశిబాబు కనపాల తెలిపారు. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. కాకినాడకు చెందిన ఎ. శివప్రసాద్‌చే ఘంటసాల వారి మధుర గీతాలాపన జరుగుతుందని తెలిపారు. సాయంత్రం మాస్టర్ టి. శరత్‌చంద్ర ఆధ్వర్యంలో ఘంటసాల స్వరామృతధార కార్యక్రమం ఉంటుందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement