‘అమరావతి’లో భాగస్వాములు కండి | Get partners in Amravati | Sakshi
Sakshi News home page

‘అమరావతి’లో భాగస్వాములు కండి

Sep 9 2015 1:26 AM | Updated on Sep 3 2017 9:00 AM

‘అమరావతి’లో భాగస్వాములు కండి

‘అమరావతి’లో భాగస్వాములు కండి

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీకి కేంద్ర మంత్రి

టాటా గ్రూప్ చైర్మన్‌కు వెంకయ్య విజ్ఞప్తి

 సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వెంకయ్యతో సైరస్ మిస్త్రీ భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ భారత్, అందరికీ ఇల్లు తదితర అంశాలపై వీరిరువురూ చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మిస్త్రీని వెంకయ్య కోరారు. నిర్మాణ రంగంలో క్రియాశీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాభివృద్ధిలో నూతన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సహకారం అందించాలని కోరారు. మిస్త్రీ స్పం దిస్తూ, ఇప్పటికే స్వచ్ఛభారత్‌లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement