నేడు టాటా సన్స్‌ భేటీ  | Tata Sons board will meet on 26 May 2026 | Sakshi
Sakshi News home page

నేడు టాటా సన్స్‌ భేటీ 

May 26 2026 5:20 AM | Updated on May 26 2026 8:10 AM

Tata Sons board will meet on 26 May 2026

నష్టాల కంపెనీలపై చర్చించే అవకాశం 

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లోని పలు అన్‌లిస్టెడ్‌ సంస్థల నష్టాలు భారీగా పెరుగుతున్న తరుణంలో టాటా సన్స్‌ బోర్డు మంగళవారం (నేడు) సమావేశం కానుంది. ఈ సందర్భంగా సంస్థల ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలను చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పునరి్నయామకం అంశం చర్చకు రాకపోవచ్చని పేర్కొన్నాయి.

టాటా గ్రూప్‌లో అంతర్గతంగా విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో టాటా సన్స్‌ బోర్డు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్‌లో భాగమైన అన్‌లిస్టెడ్‌ సంస్థలు రూ. 10,905 కోట్ల నష్టాలు ప్రకటించాయి. అటుపైన ఇవి రూ. 29,000 కోట్లకు చేరి ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement