ఆ ఆరోపణలు అవాస్తవం: గంటా కార్యాలయ వర్గాలు | ganta srinivasarao office condemns bahubali black tickets issue | Sakshi
Sakshi News home page

ఆ ఆరోపణలు అవాస్తవం: గంటా కార్యాలయ వర్గాలు

Jul 10 2015 11:51 AM | Updated on Sep 3 2017 5:15 AM

ఆ ఆరోపణలు అవాస్తవం: గంటా కార్యాలయ వర్గాలు

ఆ ఆరోపణలు అవాస్తవం: గంటా కార్యాలయ వర్గాలు

బాహుబలి సినిమా బ్లాక్ టికెట్లపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయ వర్గాలు స్పందించాయి.

విశాఖ : బాహుబలి సినిమా బ్లాక్ టికెట్లపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయ వర్గాలు స్పందించాయి. బ్లాక్ టికెట్లపై ప్రేక్షకులు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఖండించాయి. కాగా విశాఖ జిల్లావ్యాప్తంగా బ్లాక్ టికెట్ల విక్రయాలు జరిగాయి. రూ.25 టికెట్లను రూ.1000, రూ.50 టికెట్లను 2వేల నుంచి 4000 వేల వరకూ విక్రయించారు. మంత్రి గంటా కార్యాలయం వద్ద బాహుబలి టికెట్లను రూ.500లకు విక్రయించారని అభిమానులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement