తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమాల్లో 'బాహుబలి' ఒకటి. ప్రభాస్, రాజమౌళి లాంటి వాళ్లతో పాటు తమన్నా లాంటి హీరోయిన్లని గర్వపడేలా చేసింది. పాన్ ఇండియా గుర్తింపు దక్కేందుకు కారణమైంది. ఈ మూవీలో వీరోచిత నారీ అవంతికగా తమన్నా అదరగొట్టేసిందని చెప్పొచ్చు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా.. 'బాహుబలి' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
'గత కాలాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. అప్పట్లో ఒక ప్రాంతీయ భాషా చిత్రాన్ని రూ. 200 కోట్లు ఖర్చు పెట్టి తీయడమనేది ప్రమాదకరమైన ప్రయత్నమే. ఎందుకంటే ఒకవేళ వ్యాపార పరంగా అటూ ఇటూ అయితే అందులోంచి బయటపడటం అనేది కష్టం. భారీ నష్టం వాటిల్లేది. దర్శకుడు రాజమౌళి దూరదృష్టి, ఏ విషయంలోనూ రాజీపడని తత్వం, ధృఢమైన నమ్మకమే 'బాహుబలి'ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. అనూహ్య విజయానికా కారణమైంది. బాహుబలి రెండు భాగాలు వ్యాపార పరంగా అత్యధిక వసూళ్లు సాధించాయి. అలానే ఇండస్ట్రీలోని మిగతా దర్శక నిర్మాతల్లో నమ్మకాన్ని కలిగించాయి. ఆ తర్వాత పలు ప్రాంతీయ భాషా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొంది విజయాలను అందుకుంటున్నాయి' అని తమన్నా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ.. తమిళంలో విశాల్‌కు జంటగా 'మకుటం' సినిమా చేస్తోంది. అలానే హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
(ఇదీ చదవండి: అమ్మ బాబోయ్.. రూ.10 కోట్లు బడ్జెట్ రూ.1000 కోట్ల కలెక్షన్?)


