'కళామతల్లికి సేవ చేస్తున్నాం' లాంటి మాటలు ఎవరెన్ని చెప్పినా సినిమా అనేది ప్యూర్ వ్యాపారం. ఏ నిర్మాత అయినా పెట్టుబడి ఎంత? లాభం ఎంత? లాంటి విషయాలే అంతిమంగా ఆలోచిస్తాడు. కొందరు నిర్మాతలకు అప్పుడప్పుడు అలాంటి అదృష్టం దక్కుతుంది. ఇప్పుడు హాలీవుడ్ నిర్మాణ సంస్థకు అలాంటి జాక్‌పాట్ తగిలింది. అది కూడా ఓ హారర్ సినిమాతో. ఇంతకీ దీని సంగతేంటి? వసూళ్లు ఎలా ఉన్నాయి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
ఈ నెల 15న అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో 'అబ్సెషన్' అనే సైకో హారర్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. దీనికి రూ.7 నుంచి రూ.10 కోట్ల బడ్జెట్ అయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఇది సృష్టిస్తున్న సెన్సేషన్ చూస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే. ఎందుకంటే తొలివారం 16 మిలియన్ డాలర్లు, రెండోవారం 22 మిలియన్ డాలర్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు అమెరికాలో దగ్గర దగ్గర 60 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. మరో వారం పదిరోజుల్లో 100 మిలియన్ డాలర్ల గీత దాటేయడం గ్యారంటీ. ఇదే గనక నిజమైతే పెట్టిన పెట్టుబడి 100 రెట్ల లాభం సంపాదించినట్లే.
మరి ఇంతలా ఈ సినిమాలో ఏముందా అని చూస్తే.. బేర్ అనే కుర్రాడు నిక్కీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమని బయటకు చెప్పడు. ఓసారి చిత్రమైన బొమ్మ ఎదుట నిలబడి నిక్కీ వేరే ఎవరిని ప్రేమించనంత గొప్పగా తనని ఇష్టపడాలని కోరుకుంటాడు. కట్ చేస్తే నిక్కీ లాంటి అమ్మాయి ఇతడి జీవితంలోకి వస్తుంది. ఆమె ఓ సైకో. చిత్రంగా ప్రవర్తిస్తూ ఘోరమైన హత్యలు చేయడం మొదలుపెడతుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. హద్దులు మీరి అతిగా ప్రేమిస్తే ఏమవుతుందనేది ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్ చూడాలంటే మీకు కచ్చితంగా గుండె ధైర్యం కావాలి. మన దేశంలో ఈ వీకెండ్ రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: చరణ్ బాడీగార్డ్ ప్రొఫెషనల్ ఫైటరా? ఇతడెవరు జీతమెంత?)


