చరణ్ బాడీగార్డ్ ప్రొఫెషనల్ ఫైటరా? ఇతడెవరు జీతమెంత? | Who Is Ram Charan New Bodyguard Kevin Kunta Becomes Internet Sensation, Know About His Salary And Other Details | Sakshi
Sakshi News home page

Ram Charan Bodyguard: మెగా బాడీగార్డ్ గురించి సోషల్ మీడియాలో వైరల్

May 25 2026 4:21 PM | Updated on May 25 2026 5:11 PM

Ram Charan Bodyguard Name And Salary Details

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు బయట పెద్దగా తిరగరు. సెల్ఫీల పేరుతో అభిమానులు ఇబ్బంది పెడతారని భయం. అందుకు కొందరు బాడీగార్డ్స్‌ని పెట్టుకుంటారు. సల్మాన్ ఖాన్, యష్ లాంటి వాళ్ల లోకల్‌గా ఉండేవాళ్లని నియమించుకోగా మెగాహీరో రామ్ చరణ్ మాత్రం ఏకంగా ఓ ఆఫ్రికన్ ఫైటర్‌ని తనకు బాడీగార్డ్‌గా పెట్టుకున్నాడు. గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇతడెవరు? జీతం ఎంతిస్తున్నారు?

(ఇదీ చదవండి: డబ్బింగ్‌లకు డబ్బులు.. తెలుగు సినిమాలకు నిల్.. ఎందుకిలా?)

'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌గా ముంబైలో జరిగింది. అప్పటినుంచి చరణ్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెంటే ఉంటూ భద్రత కల్పిస్తున్న వ్యక్తి పేరు కెవిన్ కుంట. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన ఇతడు.. అంతర్జాతీయ స్థాయిలో ఎమ్ఎమ్ఏ(MMA) ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు.

కేవలం బాక్సింగ్ రింగ్ లోపలే కాకుండా నిజ జీవితంలోనూ సెలబ్రిటీలు, అంతర్జాతీయ వీఐపీలకు VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే 'పెద్ది' ప్రమోషన్లు జరిగేంతవరకు రామ్ చరణ్ ఇతడిని మాట్లాడుకున్నట్లు ఉంది. అయితే భద్రత కల్పిస్తున్నందుకుగానూ రోజుకు రూ.2 లక్షలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్‌కి రూ.15 లక్షలు ఇస్తుండగా.. కన్నడ హీరో యష్ తన బాడీగార్డ్‌కి రూ.10 లక్షల వరకు ఇస్తున్నాడని టాక్. ఇప్పుడు చరణ్ బాడీగార్డ్ గురించి వస్తున్న నిజమైతే మాత్రం ఇదో రికార్డ్ అవుతుందేమో!

(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement