ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం | Actress Rambha Father Passed Away | Sakshi
Sakshi News home page

Rambha: టాలీవుడ్ మాజీ హీరోయిన్ ఇంట్లో విషాదం

May 25 2026 1:53 PM | Updated on May 25 2026 2:22 PM

Actress Rambha Father Passed Away

ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఈమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రంభ.. తండ్రి తలుచుకుని చాలా భావోద్వేగానికి గురైంది. నా హృదయంలో నీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎ‍న్నో ఇ‍బ్బందులు పెట్టినప్పటికీ నీ ముఖంపై చిరునవ్వు మాత్రం చెరిగిపోనివ్వలేదు. నువ్వు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యమైపోయింది అని రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

విజయవాడకు చెందిన రంభ అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈమెకు తొలుత మలయాళంలో అవకాశమొచ్చింది. 1992లో 'సర్గామ్' మూవీతో ఈమె హీరోయిన్ కెరీర్ మొదలైంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ హిట్ తర్వాత అదే ఏడాది 'ఆ ఒక్కటి అడక్కు'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అయింది. దీంట్లోనే ఆమె స్క్రీన్ నేమ్ రంభగా ఫిక్స్ అయింది. తర్వాత సూపర్‌ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున ఇలా స్టార్‌ హీరోలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసింది. 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్‌పూరి, బెంగాలి భాషల్లోనూ రంభ సినిమాలు చేసింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ని పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఇండస్ట్రీకి దూరమైనా రియాలిటీ టీవీ షోలకు ఈ మధ్య జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. ఇంతలోనే తండ్రి చనిపోవడంతో దుఖంలో మునిగిపోయింది.

(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement