హైదరాబాద్‌లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్ | Prabhas Begins Construction Of Lavish Dream Mansion In Hyderabad’s Kokapet, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Prabhas Mansion: ప్రభాస్ లగ్జరీ ఇంటి ప్లానింగ్.. కళ్లు చెదిరిపోవాల్సిందే!

May 25 2026 12:59 PM | Updated on May 25 2026 1:35 PM

Prabhas Mansion Works Hyderabad Kokapet Latest Update

పది పదిహేనేళ్ల ముందు వరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేసే ప్రభాస్.. ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ తదితర చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు హైదరాబాద్‌లో తన డ్రీమ్ హౌస్ పనులు కూడా మొదలుపెట్టేశాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో డిస్కషన్‌‌కి కారణమైంది. ఇంతకీ ఈ ఇంటి సంగతేంటి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కి ఇల్లు ఉంది. రాయదుర్గ్‌లో ఓ గెస్ట్ హస్ ఉంది. అయితే ఈ ప్రాంతమంతా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది. అందుకే రెండేళ్ల క్రితం ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటలో రెండేళ్ల క్రితం ప్రభాస్ రెండు ఎకరాల స్థలం కొన్నాడు. ఇప్పుడు ఆ చోటులోనే నిర్మాణ పనులు మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ మధ్యే సదరు స్థలానికి మున్సిపల్ అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించడంతో.. డార్లింగ్ ప్రభాస్ తన లగ్జరీ మ్యాన్షన్ నిర్మించే పనిలో పడ్డాడు. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కి ఈ స్థలం చాలా దగ్గరగా ఉంది. ఇక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్లొచ్చు. ప్రయాణ సౌకర్యాల పరంగా సదుపాయం ఉండటంతోనే ఇక్కడ మ్యాన్షన్ కడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కోకాపేటలో ఎకరం విలువ రూ.80 కోట్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రభాస్ మ్యాన్షన్ కట్టబోయే స్థలమే రూ.160 కోట్ల పైచిలుకు అన్నమాట. ఇప్పుడు కడుతున్న డ్రీమ్ హౌస్‌లో లగ్జరీ వసతులు చాలానే ఉండబోతున్నాయని మాట్లాడుకుంటున్నారు. హై ఎండ్ ఫిట్‌నెస్ సెంటర్, మోడరన్ సౌండ్ సిస్టమ్‌తో ప్రైవేట్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, లాన్ ఏరియా ఇందులో ఉండబోతున్నాయట. ఈ భారీ ప్యాలెస్ నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: చిరంజీవి దగ్గరకు ఎగ్జిబిటర్స్ .. 'పెద్ది' గురించి ఏం తేలుస్తారో?)

Advertisement
 
Advertisement
Advertisement