ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్ | gang rape case limelight in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్

Sep 28 2014 7:15 PM | Updated on Sep 2 2017 2:04 PM

ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్

ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్

యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కురిటిపెంటలో ఆలస్యంగా వెలుగుచూసింది.

విజయనగరం: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కురిటిపెంటలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటర్మీయట్ చదువుతున్న విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు లైంగిక దాడి చేశారు.  సెల్ఫోన్ తో ఫోటోలు తీసి ఆమెను బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక బాధితురాలు ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను వెతికి పట్టుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement