తిరుమలలో మళ్లీ మంటలు | Forest fire rages in Tirumala again | Sakshi
Sakshi News home page

తిరుమలలో మళ్లీ మంటలు

Mar 29 2014 3:34 AM | Updated on Oct 4 2018 6:03 PM

తిరుమలలో మళ్లీ మంటలు - Sakshi

తిరుమలలో మళ్లీ మంటలు

తిరుమల శేషాచల అడవుల్లో శుక్రవారం మళ్లీ మంటలు చెలరేగాయి. తొలుత జాపాలీ తీర్థంలో రోడ్డుమార్గంలోని అటవీ ప్రాంతంలో మంట లు వ్యాపించాయి.

సాక్షి, తిరుమల: తిరుమల శేషాచల అడవుల్లో శుక్రవారం మళ్లీ మంటలు చెలరేగాయి. తొలుత జాపాలీ తీర్థంలో రోడ్డుమార్గంలోని అటవీ ప్రాంతంలో మంట లు వ్యాపించాయి. పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వరకు విస్తరించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఇక్కడ సుమారు ఐదెకరాల అడవి కాలిపోయింది.
 
 మరోవైపు ఆలయానికి కిలోమీటరు దూరంలోని బాలాజీనగర్ గ్యాస్‌గోడౌన్‌కు సమీపంలోని అడవిలోనూ మంటలు చెలరేగాయి. ఇక్కడ సుమారు ఎకరం మేరకు అడవి కాలిబూడిదైంది. కాగా, శ్రీవారి ఆలయ ఉత్తరమాడ వీధిలో హయగ్రీవ మందిరం పోటుశాలలో గ్యాస్‌లీకై మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement