తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుంగభద్ర ఎగువన భారీ వర్షాలు
Aug 31 2017 11:26 AM | Updated on Sep 12 2017 1:29 AM
- డ్యామ్‌కు పెరుగుతున్న వరద
హొసపేటె : తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండటంతో ఇన్‌ఫ్లో 24,438 క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్ర డ్యాం ఎగువన ఆగుంబె, శివమొగ్గ, తీర్థహళ్లి, చిక్కమగళూరు తదితర మలెనాడు ప్రదేశాల్లో వర్షాలు జోరుగా కురుస్తుండటంతో రోజురోజుకు డ్యామ్ ఇన్‌ఫ్లో పెరుగుతోంది.
దీంతో డ్యాంలో నీటి నిల్వ 63.670 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1621.95 అడుగులు, ఇన్‌ఫ్లో 23,438 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 700 క్యూసెక్కులుగా ఉందని తుంగభద్ర మండలి తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటి మట్టం 1617.55 అడుగులు, నీటి నిల్వ 51.850 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 7107 క్యూసెక్కులుగా ఉండేదని తెలిపారు.
Advertisement
Advertisement