ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే | Five Festivals In Only Leave Days In Andhrapradesh | Sakshi
Sakshi News home page

ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే

Dec 6 2019 8:20 AM | Updated on Dec 6 2019 8:23 AM

Five Festivals In Only Leave Days In Andhrapradesh - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వీటిలో ఐదు పండుగలు సెలవురోజులైన ఆదివారాలు, రెండో శనివారం రోజున రానుండడం విశేషం. వారాంతపు సెలవురోజుల్లో ఇవి రానుండడంతో ఆ మేరకు ఉద్యోగులు సెలవులు కోల్పోయినట్టే. ఆదివారం సెలవుల్లో రిపబ్లిక్‌ డే, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహర్రం, విజయదశమి ఉండగా, దీపావళి పండుగ రెండో శనివారం వస్తోంది. ఇవే కాదు మరో ఐచ్ఛిక సెలవు(బసవ జయంతి) సైతం ఆదివారమే రానుంది. వచ్చే ఏడాది (2020)లో వచ్చే సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులతోపాటు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం కింద వచ్చే సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలివీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement