2 రాష్ట్రాల్లో 5 కేంద్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్! | Five Centres for Medical Counselling | Sakshi
Sakshi News home page

2 రాష్ట్రాల్లో 5 కేంద్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్!

Aug 28 2014 2:36 AM | Updated on Sep 2 2017 12:32 PM

ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ విషయంలో రెండు ప్రభుత్వాలను సమన్వయం చేసుకుని ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీచేసిన ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విజయవాడ: ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ విషయంలో రెండు ప్రభుత్వాలను సమన్వయం చేసుకుని ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీచేసిన ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన అనంతరం మంగళవారం రాత్రి 10 గంటలకు హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. ఆ నోటిఫికేషన్ కాపీలను హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ అందజేశారు.

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం, తిరుపతి ఎస్‌వీయూ, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్, విజయవాడలోని ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement