AP: ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో మెడికోల మాల్‌ ప్రాక్టీస్‌ | Medicos Caught Cheating with Phones Smartwatches In AP | Sakshi
Sakshi News home page

AP: ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో మెడికోల మాల్‌ ప్రాక్టీస్‌

Apr 28 2026 7:31 PM | Updated on Apr 28 2026 8:08 PM

Medicos Caught Cheating with Phones Smartwatches In AP

విజయవాడ:  ఎన్టీఆర్‌ హెల్త్‌వర్శిటీ వైద్య పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చోటు చేసుకుంది.చిట్టీలు, ఫోన్లు, స్మార్ట్‌ వాచీల సాయంతో మాస్‌ కాపీయింగ్‌ జరిగింది.  సుమారు 20 మంది మెడికోలు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. 

ఇన్విజిలేటర్లు సైతం సెల్‌పోన్లు వాడుతూ దొరికారు. ఇద్దరు ఇన్విజిలేటర్లపై వీసీ డా. చంద్రశేఖర్‌ చర్యలు తీసుకున్నారు. మూడేళ్ల పాటు పరీక్షల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. 

ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ కెమెరాలు అమర్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పరీక్ష జరిగే సమయంలో అధికారుల పర్యవేక్షణలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement