విజయవాడ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత | YSRCP Protest At Vijayawada NTR Health University Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

విజయవాడ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

Jul 7 2025 11:32 AM | Updated on Jul 7 2025 1:23 PM

YSRCP Protest AT Vijayawada NTR Health University Updates

సాక్షి, విజయవాడ:  మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం సోమవారం చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో.. వర్సిటీ ప్రధాన ద్వారం వద్దే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు, విద్యార్థులు, యువకులు గుణదల నుంచి హెల్త్‌ యూనివర్సిటీ దాకా భారీగా ర్యాలీకి వచ్చారు. అయితే ఈ సమాచారంతో అప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. 

యూనివర్సిటీ వద్దకు చేరుకోగానే వాళ్లను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి నాయకులు యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భైటాయించి నిరసన తెలుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement