బోరుబావిలో నుంచి మంటలు! | Fire comes from borewell | Sakshi
Sakshi News home page

బోరుబావిలో నుంచి మంటలు!

Oct 30 2015 4:51 PM | Updated on Sep 5 2018 9:45 PM

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం మునిపల్లి గ్రామ శివారులోని రొయ్యల చెరువు కోసం తవ్వి వదిలేసిన బోర్‌వెల్ నుంచి మంటలు ఎగసిపడతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఉప్పలగుప్పం (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం మునిపల్లి గ్రామ శివారులోని రొయ్యల చెరువు కోసం తవ్వి వదిలేసిన బోర్‌వెల్ నుంచి మంటలు ఎగసిపడతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 4 సంవత్సరాల క్రితం తవ్వి వదిలేసిన ఈ బోర్‌వెల్ వినియోగంలో లేకపోవడంతో చెరువుల యజమానులు దీన్ని పూడ్చకుండా వదిలేశారు.

గత కొంతకాలంగా ఈ బోరు నుంచి నీరు పైకి ఉబికి రావడం మొదలైంది. అయితే శుక్రవారం మాత్రం నీటితో పాటు మంటలు కూడా వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement