అగ్ని ప్రమాదంలో ఇళ్లు బుగ్గి

Fire Accident In West Godavari - Sakshi

సాక్షి,  ఉండి(పశ్చిమగోదావరి) : శుక్రవారం తెల్లవారు జామున కోలమూరు ఎస్సీ పేటలో భయానక వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి 8 ఇళ్లు పూర్తిగా దగ్ధమవడమమే కాకుండా 4 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున  3:20 నిమిషాలకు గ్రామానికి చెందిన ఇగ్గిరిసి శేఖర్‌ ఇంట్లోని ఫ్యాన్‌ వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా తీగల నుంచి మంటలు ఏర్పడి ఒక్కసారిగా చుట్టు పక్కల ఇళ్లకు వ్యాపించాయి. వెంటనే స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. కొన్ని ఇళ్లకు కొబ్బరాలకుతో దడి ఏర్పాటు చేయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌కు తోడు గ్యాస్‌ సిలిండర్లుకు మంటలు వ్యాపించి అవి పేలడం ప్రారంభిండంతో గ్రామమంతా ఒక్కసారిగా భయాందోళకు గురయ్యారు.ఎవ్వరూ మంటలను అదుపుచేసే ప్రయత్నం చేయలేకపోయారు.ఈ అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో 13 కుటుంబాలు రోడ్డున పడ్డారు. నాలుగు కుటుంబాలు కొంత మేర నష్టపోయాయి. ఇగ్గిరిసి శేఖర్, ఇగ్గిరిసి సత్యానందం, ఇగ్గిరిసి యెషయా, నేతల కృష్ణమూర్తి, నేతల వరదయ్య, రుద్దర్రాజు సత్యనారాయణరాజు, ఇంజేటి సుబ్బమ్మ, ఇంటి ఆనందరావు, నేతల బుజ్జి, నేతల కాంతమ్మ, ఇంటి శాంతారావు, మద్దా సరస్వతి, ఇంటి ఇస్సాకు చెందిన ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇగ్గిరిసి ఆనందరావు, నేతల మార్టిన్, పాము యేసు, ఇంటి కృష్ణయ్యకు చెందిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అనంతరం సమాచారం అందడంతో ఫైరింజన్‌ సాయంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్థి నష్టం ఏర్పడినట్టు అంచనా వేస్తున్నామని ఆకివీడు అగ్నిమాపక అధికారి మహమ్మద్‌ ఆలీబేగ్‌ తెలిపారు. 

పీవీఎల్‌ పరావర్శ
అగ్ని ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న వైఎ స్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ పీవీఎల్‌ నర్సింహరాజు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితుల పరిస్థితిని పరిశీలించారు. తహసీ ల్దార్‌ కె రామఆజనేయులతో పరిస్థితిపై సమీక్షిం చారు. హౌసింగ్‌ అధికారులకు ఫోన్‌ చేసి వెంటనే గృహనిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.5  వేలు, 10 కేజీల

బియ్యాన్ని అందించారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరిచర్ల సుభాష్‌రాజు స్వగ్రామం కోలమూరు కావడంతో తెల్లవారుజాము నుంచి ఆయన బాధితులకు అండగా నిలిచివారికి తన సహాయ సహకారాలు అందించారు. ఎమ్మెల్యే మంతెన రాంబాబు కోలమూరు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి నగదు, 25 కేజీల బియ్యాన్ని అందించినట్లు తెలిపారు.

దళిత సైనిక్‌ సహకారం 
దైళిత సైనిక్‌ ఆధ్వర్యంలో కోలమూరు అగ్నిప్రమాద బాధితులకు సహకారం అందించినట్లు మాలమహానాడు జిల్లా యువజన  అధ్యక్షుడు మీసాల జయరాజు తెలిపారు. 500 కేజీల బియ్యం, దుప్పట్లు అందినట్లు ఆయన తెలిపారు. బిరుదుగడ్డ రమేష్‌బాబు, అయినపర్తి రాహుల్, పోతుల జాన్‌బాబు, ట్రావెల్స్‌ ప్రభు పాల్గొన్నారు.  

బాధితులను కాపాడిన బాలుడు
కోలమూరు అగ్ని ప్రమాదంలో ఐదు గ్యాస్‌ సిలిండర్లు పేలినా, భయానకంగా మం టలు చెలరేగినా ఆస్తి బుగ్గి అయింది కాని ఏ ఒక్క ప్రాణా నికి హాని కలగలేదంటే దానికి కారణం ఓ బాలుడు. అతడే ఇగ్గిరిసి సంజయ్‌. తెల్లవారు జాము కావడంతో అందరూ ఆదమరచి నిద్రపోతున్న సమయంలో సంజయ్‌ పక్క ఇంట్లో మంటలను గుర్తించి నిద్రలేచి బయటకు వచ్చా డు. అప్పటికే మంటలు చుట్టుపక్కలకు వ్యాపిం చాయి. తండ్రి చేపల ప్యాకింగ్‌కు వెళ్లడంతో నిద్రపోతున్న తన చెల్లి సంజయ్‌ ముందుగా ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి అరిచి అందరినీ అప్రమత్తం చేశాడు. సంజయ్‌ చిన్నాన్న ఇతర కుటుంబీకులు నిద్రలేచిరావడంతో ఎగిసిపడుతున్న మంటలను గమనించి వెంటనే అందర్నీ నిద్రలేపి అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణా పాయం జరగకుండా కాపాడుకోగలిగారు. ప్రతి ఒక్కరూ సంజయ్‌ను అభినందిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top