మూలవలసలో భారీ అగ్నిప్రమాదం | fire accident in vijayanagaram district | Sakshi
Sakshi News home page

మూలవలసలో భారీ అగ్నిప్రమాదం

Mar 23 2016 12:49 PM | Updated on Sep 5 2018 9:45 PM

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మూలవలసలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

విజయనగరం : విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మూలవలసలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు.

ఈ ప్రమాదంలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.  రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వెల్లడించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement