కారంచేడులో భారీ అగ్ని ప్రమాదం | Fire accident in karamchedu | Sakshi
Sakshi News home page

కారంచేడులో భారీ అగ్ని ప్రమాదం

Aug 5 2014 11:22 AM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రకాశం జిల్లా కారంచేడులోని ధాన్యం గోదాములో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా కారంచేడులోని ధాన్యం గోదాములో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతూ... ఆ పక్కనే ఉన్న షాపులోకి కూడా ఆ మంటలు వ్యాపించాయి. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసి పడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

దాంతో ఫైరింజన్లతో వారు అక్కడి చేరుకుని అగ్నికీలలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో షాపులోని ఫర్నిచర్ దగ్ధమైంది. సుమారు రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. అయితే ధాన్యం గోదాములో అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement