బీబీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం | fire accident in bibinagar | Sakshi
Sakshi News home page

బీబీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం

Jan 6 2014 3:06 PM | Updated on Sep 5 2018 9:45 PM

బీబీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం - Sakshi

బీబీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం

జిల్లాలోని బీబీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

నల్గొండ:జిల్లాలోని బీబీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీయం అగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. రియాక్టర్లు పేలడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షలు చెప్తున్నారు. జనావాసాల మధ్య ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ ఉండటంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు 150 మంది సురక్షిత ప్రాంతాలను తరలించారు. సంఘటనాస్థిలికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ప్రమాదం జరగడంతో ఫ్యాక్టరీ చుట్టుపక్క ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది.ఈ ప్రమాదంలో రూ.18 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement