ఫ్రిజ్‌లో మంటలు! | fire accident in fridge | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్‌లో మంటలు!

Nov 3 2017 11:12 AM | Updated on Sep 5 2018 9:47 PM

కాశీబుగ్గ : పలాస జీడిపిక్క కూడలి సమీపంలో మల్లా నాగరాజు ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటల ధాటికి భారీగా పొగ కమ్ముకోవడంతో సుమారు రెండు గంటల పాటు ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థానిక అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్‌ ద్వారా విషయం తెలియజేయగా సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement