breaking news
Fridge exploded
-
తాడేపల్లిలో కలకలం.. ఫ్రిడ్జ్‌లో గ్యాస్ పేలి మంటలు
సాక్షి, గుంటూరు : తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్లో పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రకాశ్ నగర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం ఉదయం ఫ్రిడ్జ్‌లోని గ్యాస్ పేలి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పైడమ్మ అనే మహిళకు గాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఫ్రిజ్‌లో మంటలు!
కాశీబుగ్గ : పలాస జీడిపిక్క కూడలి సమీపంలో మల్లా నాగరాజు ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటల ధాటికి భారీగా పొగ కమ్ముకోవడంతో సుమారు రెండు గంటల పాటు ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థానిక అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ ద్వారా విషయం తెలియజేయగా సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. -
ఫ్రిజ్ పేలి రూ.లక్షల నష్టం
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన జి.గాదిలింగప్ప అనే రైతు ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిజ్ పేలింది. ప్రమాదంలో రూ.9 లక్షల దాకా ఆస్తి నష్టం వాటిల్లింది. ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలింది. దీంతో పక్కనే ఉన్న బీరువాలకు మంటలు వ్యాపించి రూ.2 లక్షల నగదు, మరోలక్ష విలువ గల పట్టుచీరలు, 10 తులాల బంగారం కాలిపోయింది. పొలాలకు సంబందించిన పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతాపుస్తకాలు, స్థలాలకు సంబంధించిన దస్త్రాలు, నిత్యావసర సరుకులు కూడా కాలిపోయినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే ఇంటిపైకప్పు కూడా దెబ్బతినింది. గుంతకల్లు నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా అప్పటికే పూర్తి నష్టం జరిగిపోయింది. స్థానిక ఉపసర్పంచు గురు, ఆర్ఐ సావిత్రి, వీఆర్వో మారెన్న తదితరులు అక్కడకు చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.