ఎరువుల వ్యాపారి ఆత్మహత్య | Fertilizer Dealer commits suicide in kurnool district | Sakshi
Sakshi News home page

ఎరువుల వ్యాపారి ఆత్మహత్య

Jan 25 2016 12:12 PM | Updated on Nov 6 2018 7:56 PM

కర్నూలు జిల్లాలో అప్పుల బాధతో ఓ ఎరువుల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదోని టౌన్: కర్నూలు జిల్లాలో అప్పుల బాధతో ఓ ఎరువుల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. హొలగుండ మండలం వందవాగిలి గ్రామంలో వెంకటేశ్వ ఫర్టిలైజర్స్ పేరుతో గోపాల్ (42) అనే వ్యక్తి షాపు నిర్వహిస్తున్నాడు. రైతులకు పెద్ద మొత్తంలో ఎరువులు, విత్తనాలను అప్పు కింద ఇచ్చాడు. రైతులు తిరిగి చెల్లించకపోవడం.. కంపెనీల నుంచి డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి రావడంతో గోపాల్ సోమవారం ఉదయం ఇంటి వద్ద పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు కోటి రూపాయల మేర గోపాల్ బకాయిలు కట్టాల్సి ఉన్నట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement