కుమార్తెతో మాట్లాడించలేదని తండ్రి ఆత్మహత్య | father committed suicide in ravulapalem | Sakshi
Sakshi News home page

కుమార్తెతో మాట్లాడించలేదని తండ్రి ఆత్మహత్య

Jun 11 2015 11:29 AM | Updated on Sep 3 2017 3:35 AM

కుమార్తెతో మాట్లాడించలేదని తండ్రి ఆత్మహత్య

కుమార్తెతో మాట్లాడించలేదని తండ్రి ఆత్మహత్య

తన కుమార్తెతో మాట్లాడించడం లేదని మనస్థాపం చెందిన తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

రావులపాలెం (తూర్పు గోదావరి): తన కుమార్తెతో మాట్లాడించడం లేదని మనస్థాపం చెందిన తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఊబలంక గ్రామానికి చెందిన మడికి వెంకన్న(40) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అతడి భార్య జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లింది. దీంతో కుమార్తెను వెంకన్న అత్తగారింట్లో ఉంచాడు. ఇటీవల కుమార్తెను చూడడానికి వెళ్లగా, అతడి అత్తింటివారు కుమార్తెతో మాట్లాడించలేదు.

ఫోన్ చేసినా ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద పురుగుమందు తాగాడు. స్థానికులు అతడిని గమనించి 108లో కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఎస్సై పీవీ త్రినాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement