పెంపుడు కూతురిపైనే అఘాయిత్యం | Father arrested for raping, impregnating 22-yr-old daughter | Sakshi
Sakshi News home page

పెంపుడు కూతురిపైనే అఘాయిత్యం

Oct 5 2013 2:25 PM | Updated on Sep 2 2018 4:46 PM

పెంపుడు కూతురిపైనే అఘాయిత్యం - Sakshi

పెంపుడు కూతురిపైనే అఘాయిత్యం

తండ్రే కీచకుడయ్యాడు... పెంపుడు కూతుర్ని చెరబట్టి గర్భవతిని చేశాడు... ఆ దుర్మార్గుడ్ని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 హైదరాబాద్ : తండ్రే కీచకుడయ్యాడు... పెంపుడు కూతుర్ని చెరబట్టి గర్భవతిని చేశాడు... ఆ దుర్మార్గుడ్ని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక దుబాయ్ గేట్ సమీపంలో ఉండే ఓ వ్యక్తి తమ కూతురిని చిన్నతనంలోనే శ్రీకాకుళంలో ఉండే తోడల్లుడు రా మ్మూర్తి (42)కి దత్తత ఇచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 22 ఏళ్లు. మూడేళ్ల క్రితం తన భార్య గర్భం దాల్చిన సమయంలో రామ్మూర్తి చూపు పెంచుకుంటున్న కూతురుపై పడింది. అప్పటి నుంచి ఆమెను బలవంతంగా అనుభవిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో గొడవపడి అమ్మాయిని సొంత తల్లిదండ్రుల వద్ద వదిలేసి రమ్మని ఒత్తిడి చేసింది. దీంతో ఇటీవల బోయిన్‌పల్లికి వచ్చిన రామ్మూర్తి.. అమ్మాయి చెడుతిరుగుళ్లకు అలవాటుపడిందంటూ నిందవేయడంతో పాటు మీ కూతురిని పంపేస్తానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు కూతురుని ఫోన్‌లో నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. తాను పెంపుడు తండ్రి కారణంగానే గర్భం దాల్చానని బోరుమంది.

ఆమె తల్లిదండ్రులు బోయిన్‌పల్లి పోలీసులను ఆశ్రయించగా, వారు బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. మహిళా పోలీసులు బాధిత అమ్మాయిని ఫోన్‌లో విచారించి... ఆమె వాంగ్మూలాన్ని సేకరించారు. ఇదిలా ఉండగా.. నిందితుడు బాధితులతో రాజీ కుదుర్చుకొనేందు శుక్రవారం అమ్మాయిని తీసుకొని రామ్మూర్తి నగరానికి వచ్చాడు. ఈ సమాచారం అందుకున్న బోయిన్‌పల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement