లారీని ఢీకొట్టి తండ్రీకొడుకులు మృతి | father and son died in a accident in nellore district | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టి తండ్రీకొడుకులు మృతి

Jan 22 2015 8:31 PM | Updated on Aug 25 2018 6:06 PM

ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొని తండ్రి, కొడుకులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా బొగోలు మండలంలో రాయచర్ల పాడు రహదారిపై గురువారం జరిగింది.

కొడవటూరు: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొని తండ్రి, కొడుకులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా బొగోలు మండలంలో రాయచర్ల పాడు రహదారిపై గురువారం జరిగింది. బొగోలు మండలం తాల్లూరు గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు ఓడ మహేష్(47), మధు(17)లు కొత్త బైక్ కొనడానికి ద్విచక్ర వాహనంపై నెల్లూరుకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో రాయచర్లపాడు రహదారి వద్ద ఆగి ఉన్న లారీని వీరి బైక్ ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ఓడ మహేష్ కుమారుడు మధు ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement