త్రండీకొడుకులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైఎస్సార్‌జిల్లా కమలాపురం మండల పరిధిలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది.
కమలాపురం (వైఎస్సార్‌జిల్లా) : త్రండీకొడుకులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైఎస్సార్‌జిల్లా కమలాపురం మండల పరిధిలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. మండలంలోని జంబాపురం గ్రామానికి వెళ్లే దారికి సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలు వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కిందకు దించి చూడగా.. మృతదేహాలు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. దీన్నిబట్టి నాలుగు రోజుల కిందటే ఉరి వేసుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. కాగా వారి జేబులో దొరికిన చీటీ ఆధారంగా.. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన తండ్రీకొడుకులు నందికొండ సుబ్బరాయుడు(57), మీరావలి(25)గా గుర్తించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.