పత్తి సాగులో నష్టం..రైతు బలవన్మరణం | farmer suicide in guntur | Sakshi
Sakshi News home page

పత్తి సాగులో నష్టం..రైతు బలవన్మరణం

Sep 15 2015 8:40 AM | Updated on Oct 1 2018 2:36 PM

పత్తి సాగులో నష్టం.. ఓ యువ రైతును బలి తీసుకుంది. గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన జడ శ్రీనివాస్(27) నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు.అప్పు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

పత్తి సాగులో నష్టం.. ఓ యువ రైతును బలి తీసుకుంది. గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన జడ శ్రీనివాస్(27) నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవటంతో పత్తి ఎర్రబారి, ఎదుగుదల లోపించింది. దీంతో దిగుబడి రాలేదు. రూ. లక్ష కుపైగా ఉన్న అప్పును తీర్చేదారి కానరాక సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగు మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని  మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. శ్రీనివాస్ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. అతనికి భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement