పెరిగిపోయిన అప్పులు:రైతు ఆత్మహత్య | farmer in chebrolu commits suicide | Sakshi
Sakshi News home page

పెరిగిపోయిన అప్పులు:రైతు ఆత్మహత్య

Dec 25 2015 6:35 PM | Updated on Oct 1 2018 2:44 PM

అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు బలవంతంగా తనువు చాలించాడు.

చేబ్రోలు(గుంటూరు): అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు బలవంతంగా తనువు చాలించాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కే.ఆర్.పాలెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కె . రోషయ్య(58) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.

 

ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement