విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 24 2015 3:18 PM | Updated on Oct 1 2018 2:44 PM

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ధర్మాపురం మండలం నగరం గ్రామంలో సోమవారం జరిగింది.

ధర్మాపురం (కర్నూలు) : విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ధర్మాపురం మండలం నగరం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. నగరం గ్రామానికి చెందిన మేడిచెట్టు రాజలింగం(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అయితే పక్కనే ఉన్న మరో రైతు మొక్కజొన్న పంటను అడవిపందుల బారి నుంచి కాపాడుకోవడానికి విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు.

కాగా ఉదయం బావి వద్దకు వెళ్లిన రాజలింగానికి ప్రమాదవశాత్తూ ఆ తీగలు కాలికి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement