విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Aug 21 2015 3:35 PM | Updated on Oct 1 2018 2:44 PM

బోరు మోటారు వద్దకు వెళ్లిన రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు.

ఆత్మకూరు (కర్నూలు) : బోరు మోటారు వద్దకు వెళ్లిన రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం ఎస్‌ఎం తండాకు చెందిన రాంబాబు నాయక్(30) శుక్రవారం మధ్యాహ్నం తన మొక్కజొన్న చేనుకు వెళ్లాడు. అక్కడ బోరు మోటారు ఆన్ చేసేందుకు యత్నించగా విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతని భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement