ప్రేమించి పెళ్లాడాడు.. అనుమానంతో హతమార్చాడు

Extra marital affair: Woman held for killing husband - Sakshi

వివాహేతర సంబంధం నెపంతో తరుచూ గొడవలు

కత్తెరతో భార్యను హతమార్చిన వైనం

రామ్మూర్తినగర్‌లో ఘటన

నెల్లూరు(క్రైమ్‌): ప్రేమించుకొన్నారు... పెళ్లిచేసుకున్నారు... చక్కగా సాగిపోతున్న వారి సంసారంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య గొంతలో కత్తెరతో పొడిచి హతమార్చాడు భర్త. ఈ ఘటన నగరంలోని రామ్మూర్తినగర్‌ ఒకటోవీధిలో సోమవా రం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల స మాచారం మేరకు.. నెల్లూరు రూరల్‌ మండలం మూడోమైలుకు చెందిన ఏకొ ల్లు రమణయ్య, కామేశ్వరమ్మ దంపతులు. వారికి ఇద్దరు కమార్తెలు. పెద్ద కుమా ర్తె లలిత(36) నవాబుపేట బీవీఎస్‌ స్కూల్‌లో 2000లో పదోతరగతి చదువుతున్న సయమంలో పారిపోయి తిరుపతికి వెళ్లింది. తిరుపతి రైల్వేస్టేషన్‌లో కర్నాటకలోని హుబ్లి రాజ్‌పూత్‌ బంకాపూరుకు చెందిన డోరమని సుభాష్‌(రైల్లో ఏసీకోచ్‌లో బెడ్‌షీట్లు మార్చే పని)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి.. ఇద్దరూ వివాహం చేసుకొన్నా రు. తిరుపతిలోనే లలిత పాచిపనులు, సుభాష్‌ పెయింట్‌ పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. 

వారికి శ్రీను, లక్కి కొడుకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుందన్న అనుమానంతో సుభాష్‌ భార్య లలితను తీవ్రంగా కొట్టేవాడు. విషయం తెలుసుకున్న లలిత తల్లిదండ్రులు అల్లుడిని కుమార్తెను మూడోమైలుకు íతీసుకొచ్చారు. ఈ క్రమంలో రమణయ్య, కామేశ్వరమ్మ రామ్మూర్తినగర్‌లోని గచ్చుకాలువకు మకాం మార్చారు. దీంతో లలిత, సుభాష్‌లు కూడా పిల్లలిద్దరిని గచ్చుకాలువలోని మున్సిపల్‌ హైస్కూల్‌లో చేర్పించి, రామ్మూర్తి నగర్‌లోని రామాదేవి అనే మహిళ ఇంటిలోని రేకులషెడ్‌లో అద్దెకు ఉంటున్నారు. లలిత రమాదేవి ఇంట్లో పాచిపనులు చేస్తుండగా, సుభాష్‌ పెయింట్‌పనులు చేసుకుంటన్నాడు. ఈ నెల 30న సోమవారం రాత్రి లలిత, సుభాష్‌లు మళ్లీ తీవ్రంగా గొడవపడ్డారు. పద్దతి మార్చుకోమని చెబితే వినవా అంటూ సుభాష్‌ ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి చెట్టువద్ద తీవ్రంగా కొట్టసాగాడు. ఈ విషయాన్ని గమనించిన వారి చిన్న కొడుకు లక్కీ అమమ్మకు జరిగిన విషయాన్ని చెప్పాడు. 

వారు ఇంటికి వచ్చే సమయానికి సుభాష్‌ కత్తెరతో లలిత గొంతు, ఎదపై బలంగా పొడవసాగాడు. కామేశ్వరమ్మ రావడాన్ని గమనించి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయపడిన కుమార్తెను కామేశ్వరమ్మ స్థానికుల సహాయంతో ఆటోలో నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లింది. అప్పటికే లలిత పరిస్థితి విషమంగా ఉండటంతో వారు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆమెను పరీక్షించి, అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.సంగమేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి కామేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు మంగళవారం తెల్లవారుజామున సుభాష్‌పై హత్యకేసు నమోదు చేశారు. అయితే హత్య జరిగిన కొద్దిసేపటికే సుభాష్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top