బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు: ఒకరు మృతి | Explosion at raebareli fireworks factory kills one | Sakshi
Sakshi News home page

బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు: ఒకరు మృతి

Nov 2 2013 2:54 PM | Updated on Aug 24 2018 2:33 PM

ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో బాణాసంచా మార్కెట్లో శనివారం పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో బాణాసంచా మార్కెట్లో శనివారం పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు వెంటనే స్పందించి ఇటు పోలీసులు, అటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.

 

అలాగే గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోటలోని బాణాసంచా కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. ఆ ఘటనలో భార్యభర్తలతోపాటు బాలుడుకి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి  పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటురు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాకటాలు బాణాసంచా కర్మాగారం వద్దకు చేరుకుని ఎగిసి పడుతున్న అగ్నికిలలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement