చిన్నారి పనిమనిషిపై మాజీ సైనికుడి అఘాయిత్యం | Ex-serviceman booked for raping minor domestic help | Sakshi
Sakshi News home page

చిన్నారి పనిమనిషిపై మాజీ సైనికుడి అఘాయిత్యం

Jan 15 2014 3:52 PM | Updated on Jul 28 2018 8:51 PM

తమ ఇంట్లో పనిచేస్తున్న 13 ఏళ్ల పనిమనిషిపై 67 ఏళ్ల మాజీ సైనికుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణం నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలో జరిగింది.

తమ ఇంట్లో పనిచేస్తున్న 13 ఏళ్ల పనిమనిషిపై 67 ఏళ్ల మాజీ సైనికుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణం నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలో జరిగింది. బెంజిమెన్ అనే నిందితుడు ఆర్మీలో వంటవాడిగా పనిచేసి రిటైరయ్యాడు. అతడి ఇంట్లో బాధితురాలు పనిమనిషిగా చేస్తోంది. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఈమెపై బెంజిమెన్ రెండుసార్లు అత్యాచారం చేశాడు. అయితే, బాధితురాలు కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతి అని తేలింది. ఏంటని అడిగితే ఆమె అసలు విషయం చెప్పింది.

తనను తాడుతో కట్టిపారేసి తనపై బెంజిమెన్ అత్యాచారం చేశాడని బాధితురాలు తన తల్లికి, పోలీసులకు తెలిపింది. తల్లి చేసిన ఫిర్యాదు మేరకు నాయుడుపేట పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. అతడి కోసం గాలింపు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement