జైలు నుంచి ఖైదీ పరారీ | Escaped inmate in open air jail | Sakshi
Sakshi News home page

జైలు నుంచి ఖైదీ పరారీ

Jul 5 2016 8:26 AM | Updated on Jul 11 2019 7:49 PM

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ జైలు నుంచి మంగళవారం తెల్లవారుజామున ఓ ఖైదీ పరారయ్యాడు.

అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ జైలు నుంచి మంగళవారం తెల్లవారుజామున ఓ ఖైదీ పరారయ్యాడు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఎరికలన్న అనే ఖైదీ జైలు నుంచి పరారయ్యాడు. ఆ విషయాన్ని ఈ రోజు ఉదయం గుర్తించిన జైలు సిబ్బంది వెంటనే జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలియజేశారు.

ఎరికలన్న కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎరికలన్న స్వస్థలం పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement